కేంద్ర ప్రభుత్వం నిర్వహించబోతున్న పోటీలో వరల్డ్ నో టుబాకో డే లో భాగంగా పొగాకు వల్ల ప్రజల్లో ఎలాంటి నష్టం కలుగుతుంది, అనే అంశం గురించి ఒక వీడియో తీయాల్సి ఉంటుంది. ఈ వీడియో వ్యవధి 30 సెకన్ల నుంచి 60 సెకన్ల నిడివి ఉన్న షార్ట్ వీడియో తీసి పంపించాలి. ఇందులో 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు పాల్గొనడానికి అర్హులు.ఈ పోటీలో గెలిచిన వారికి ఫస్ట్ ప్రైజ్ కింద రెండు లక్షల రూపాయలు, రెండవ ప్రైస్ కింద రూ.1.5 లక్షలు, మూడవ ప్రైస్ కింద ఒక లక్ష రూపాయల బహుమతి అందివ్వడం జరుగుతుంది . ఇక అంతేకాదు వీళ్లతో పాటు మరొక పది మంది పదివేల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది.