ప్రస్తుతం రైతులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం రకరకాల పథకాలను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. వీటిల్లో ఇప్పుడు మనం రెండు స్కీం ల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలి. ఈ పథకాల ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం రూ. 42,000 లభిస్తాయి. ఇక ఆ పథకాల విషయానికి వస్తే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం గురించి అందరికీ తెలుసు. ఈ పథకంలో చేరిన వారికి మోదీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ. 6000 ఉచితంగా అందిస్తోంది. అయితే ఈ డబ్బు ఒకేసారి కాకుండా విడతల వారీగా రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు అలా నాలుగు నెలలకు ఒకసారి రూ.2000 చొప్పున మూడుసార్లు 6000 రూపాయలను అందిస్తున్నారు.


ఇకపోతే ఇప్పటికే ఈ పథకంలో చాలామంది రైతులు చేరి లబ్ధి పొందుతున్నారు. బ్యాంక్ అకౌంట్,  ఆధార్ కార్డు,  ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు , రేషన్ కార్డు,  పొలం పట్టా వంటివి ఉంటే ఈ పథకంలో చేరడానికి అర్హులవుతారు. ఉచితంగానే మీరు ఈ పథకంలో చేరి ప్రతి ఏటా 6000 రూపాయలను పొందవచ్చు. ఇకపోతే రైతన్నల కోసం మరో పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీనిపేరు పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన . ఇందులో రైతులకు ప్రతినెల 3000 రూపాయలు లభిస్తాయి అంటే సంవత్సరానికి 36వేల రూపాయలను పొందవచ్చు.

అయితే 18 ఏళ్ల వయసులో ఈ పథకంలో చేరితే నెలకు 55 రూపాయలు కట్టాలి. అలాగే గరిష్టంగా 200 రూపాయలు కట్టాల్సి వస్తుంది.  ఇలా ప్రతి నెల డబ్బులు కడుతూ వెళ్ళాలి.. రైతులకు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రతి నెల 3000 రూపాయలు లభిస్తాయి. ఈ లెక్కన చూసుకుంటే రెండు పథకాలకు సంబంధించి సుమారుగా రూ.42,000 మీ ఖాతాలో జమవుతాయి. మొత్తానికైతే ఈ రెండు పథకాలు రైతులకు మంచి లాభాన్ని అందిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: