కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు గర్భిణీ మహిళలకు శుభవార్త అందించింది.. ప్రసవించిన మహిళలకు ఆర్థిక సహాయం అందజేయడానికి ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో గర్భిణీ స్త్రీలకు 6000 రూపాయలను అందజేస్తారు. ముఖ్యంగా ఈ నిర్ణయంతో గర్భిణీ స్త్రీలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆసరాగా నిలబడుతుందని చెప్పవచ్చు.. మహిళలను ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల సహకారం పెంచడానికి ఇలాంటి పథకాలను అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా గర్భధారణ సమయంలో వివిధ ఇబ్బందులను ఎదుర్కొనే మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పథకాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది.

ఈ పథకానికి మాతృత్వ వందన యోజన అని పేరు కూడా పెట్టారు.  ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీలలో పనిచేస్తున్న చాలామంది మహిళలు ప్రసూతి సెలవుల తర్వాత తిరిగి ఉద్యోగాలలో చేరలేకపోతున్నారు.  దీనివల్ల బాధిత మహిళల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది.  ముఖ్యంగా 2017 నుంచి వివాహిత మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న పుట్టిన పిల్లలు పోషకాహార లోపంతో బాధపడకుండా.. ఎటువంటి వ్యాధుల బారిన పడకూడదని లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు..

ముఖ్యంగా గర్భిణీ స్త్రీల వయసు 19 సంవత్సరాల కు తక్కువ ఉండకూడదు . దీనిని మీరు ఆఫ్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి . అంటే దగ్గర్లో ఉన్న అంగన్వాడీ సెంటర్ కి వెళ్లి అప్లై చేసుకుంటే సరిపోతుంది.  ఇకపోతే ఈ పథకంలో చేరిన గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం మూడు వాయిదాలలో 6000 రూపాయలను అందిస్తుంది. గర్భిణీ స్త్రీలకు దశలవారీగా 1000 రూపాయలు,  రెండవ దశలో 2000 రూపాయలు,  మూడవ దశలో 2000 రూపాయలను అందజేస్తారు.  ఆ తర్వాత బిడ్డ పుట్టగానే ప్రభుత్వ ఆసుపత్రిలో చివరి విడతగా మరో వెయ్యి రూపాయలను అందజేస్తారు. ఈ పథకంలో మీకు ఏదైనా సమస్య అనిపించినట్లయితే వెంటనే అధికారిక హెల్ప్ లైన్ నెంబర్.. 7998799804 టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించవచ్చు. నేరుగా గర్భిణీ ఖాతాలోకి డబ్బు జమ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: