తన ఇరవై ఏళ్ల ప్రయాణాన్ని ప్రియాంక ఓ సారి గుర్తుచేసుకొంటూ అభిమానుల కోసమని ఓ వీడియోని ఇన్స్టాలో పంచుకొంది నటి ప్రియాంక. ''ఇది వేడుక చేసుకొనే సమయం. చిత్రసీమలో నా ఇరవై ఏళ్ల ప్రయాణానికి 2020 ఓ మైలురాయిలా, ఓ మధుర జ్ఞాపకంగా నిలిచింది. ఇన్నేళ్ల ప్రయాణంలో నాకు తోడుగా నిలిచి ఎంతో ప్రోత్సహించారు. ఎంతలా అంటే ఈ ప్రపంచం నాది అనేంతగా మీరు అభిమానం చూపించారు. మీ అందరికీ ధన్యవాదాలు'' అని తెలిపింది.