కేరాఫ్ కంచెరపాలెం సినిమాతో ప్రతిభ చాటిన వెంకటేష్ మహా తన రెండో ప్రయత్నంగా తీసిన సినిమా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య. నెట్ ఫ్లిక్స్ లో రిలీజై మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా శాటిలైట్ రేటు కూడా భారీగా పలికింది. ప్రముఖ ఛానెల్ 2.5 కోట్లకు ఈ సినిమా శాటిలైట్ హక్కులు పొందారు. సత్యదేవ్ హీరోగా నటించిన ఈ సినిమాలో నరేష్, సుహాస్ మంచి పాత్రల్లో నటించారు.