మొన్నటి వరకు సినిమాలకు సీక్వెల్స్ వచ్చేవి. ఇప్పుడు ఆ హవా వెబ్ సీరిసుల్లోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో ఎక్కువ ప్రజాదరణ పొందిన 'మీర్జాపూర్' వెబ్‌సిరీస్.. రెండో సీజన్‌తో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈ సీక్వెల్ విడుదలపై అమెజాన్ప్రైమ్ తాజాగా స్పష్టత ఇచ్చింది.