సురేష్ బాబు నిర్మించనున్న ఈ మూవీపై వీరి మధ్య చర్చలు కూడా సఫలం కావడం జరిగింది. ఎందుకో తెలియదు ప్రాజెక్ట్ ముందుకు వెళ్లడం లేదు. వెంకీ మామ మూవీ తర్వాత వెంకీ తరుణ్ భాస్కర్ మూవీ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ వెంకీ నారప్ప ప్రకటించడం జరిగింది. మరి ఈ చిత్రం తరువాతైనా మూవీ ఉంటుంది అనుకుంటే, ఆయన వచ్చే ఏడాది ఎఫ్ 3 ఉంటుంది అన్నారు కానీ, తరుణ భాస్కర్ మూవీపై క్లారిటీ ఇవ్వలేదు. దీనితో తరుణ్ భాస్కర్ కి షాక్ తగిలినట్టు అయ్యింది.