సీనియర్ నటుడు నరేష్ తన తల్లి అయిన దివంగత దర్శకురాలు మరియు నటి అయిన విజయ నిర్మల బయోపిక్ ను తెరకెక్కించాలి అని భావిస్తున్నట్టు టాక్ నడుస్తుంది. ఈ క్రమంలో విజయ నిర్మల గారి పాత్రకు కీర్తి సురేష్ అయితేనే న్యాయం చేస్తుంది అని నరేష్ భావిస్తున్నాడట. అయితే ‘ ‘మహానటి’ తో తనకి వచ్చిన క్రేజ్ ను బట్టి మరో బయోపిక్ చేసి ఆ ఇమేజ్ ను పాడుచేసుకోలేను. కాబట్టి నేను ఇక నుండీ ఎటువంటి బయోపిక్ లోనూ నటించను’ అంటూ కీర్తి సురేష్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. దాంతో నేరుగా నరేష్ … కీర్తి ని అడిగితే నో చెప్పే అవకాశం ఉంది. అందుకే మహేష్ తో కీర్తి ని అడిగిస్తే ఓకే అనే అవకాశం ఉందని నరేష్ భావిస్తున్నాడట.