సాయి తేజ్ ను హీరోగా పెట్టి … ఆయన సొంత బ్యానర్ అయిన ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్ పై ఓ చిత్రాన్ని చిరు డైరెక్ట్ చేయబోతున్నారు అంటూ ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. చిరు మేనల్లుడుని డైరెక్ట్ చేయబోతున్నాడు అనే వార్త రాగానే నెటిజన్స్ ట్రోలింగ్ తో రెచ్చిపోయారు.