ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు కెమెరా ముందు పొట్టి దుస్తులు వేసి నటించడం ఇష్టముండదని, అలాంటి పని తాను చేయనని సాయి పల్లవి చెప్పిన సంగతి తెలిసిందే. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ తన భావాలు చెప్పారు గరికపాటి. పదునైన ఛలోక్తులు, సందర్భానుసార సామెతలతో, హాస్యాస్పద సంగతులతో అందరినీ కట్టి పడేస్తూ ప్రవచనాలు చెప్పే గరికపాటి నరసింహారావు.. హీరోయిన్ సాయి పల్లవి తీసుకున్న ఈ నిర్ణయంపై భావోద్వేగ పూరిత కామెంట్స్ చేశారు.