పోసాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చాలా సినిమాలు చేశాడు. ఆయన మాటల్లో.. "నేను చిన్నప్పటి నుంచి కృష్ణ గారి అభిమానిని. కృష్ణ గారి అభిమాని అయ్యినంత మాత్రాన మహేష్ బాబు ని ఇష్ట పడక్కర్లేదు. కానీ కృష్ణ గారు ఎలా ఉంటారో మహేష్ బాబు కూడా అచ్చం అలానే ఉంటాడు.కృష్ణ గారి లాగ మంచి ప్రవర్తన, నవ్వు, మంచితనం, కృష్ణ గారి లాగ హ్యుమానిటీ... అవన్నీ మహేష్ బాబు లో ఉండడం నేను దగ్గరగా చూసాను. అందుకే నాకు మహేష్ బాబు అంటే వ్యక్తిగతంగా చాలా ఇష్టం." అని మహేష్ బాబు ని పొగడ్తలతో ముంచెత్తాడు కృష్ణ మురళి. ఇలా మహేష్ పై తనకున్న ప్రేమను తెలియజేశాడు.