ఖలేజాలో ఎం యస్ నారాయణ, మహేష్ లకు మధ్య ఒక సీన్ కూడా రాసుకున్నాడు. ఆ సీన్ ఏంటంటే మహేష్ తో ఎం ఎస్ "నువ్వు దేవుడివి కాదని నాకు తెలుసు" అని అంటారు. దానికి బదులుగా మహేష్ "నువ్వొక్కడివే నన్ను అర్ధం చేసుకున్నావు.మరి వారందరిలాగా నువ్వు కుడా నాకు దండం ఎందుకు పెట్టావు" అని మహేష్ అడుగుతాడు.దానికి ఎం ఎస్..."అదిగో అది మా ఇల్లు అని చెప్పగా నువ్వు దేవుడువని వీళ్ళందరూ నమ్ముతున్నారు. రేపు నువ్వు ఇప్పటిలాగే ఆ పిల్ల బతకాలి అని చెప్పినట్టు ఆ ఇల్లు కూలిపోవాలి అని అంటే వీళ్ళు మూర్ఖులు కాబట్టి కావాలనే కూల్చేస్తారు. అందుకే దండం పెట్టాను" అంటారు. నిజానికి ఈ సీన్ కూడా సినిమాలో ఉందట కానీ సినిమా లెంగ్త్ ఎక్కువయ్యిపోతుందని అప్పుడు ట్రిమ్ చేసేశారట.