సుధీర్ హీరోగా మారి ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ అనే చిత్రం చేసాడు. అది వచ్చినట్టే వచ్చి బొక్క బోర్లా పడ్డది. అంతకముందు 3 మంకీస్ అనే చిత్రం కూడా చేసాడు. అదీ ప్లాప్ అయ్యింది. ఇప్పుడు మరో సినిమాలో హీరోగా నటిస్తున్నాడట.అందుకోసం తనకు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన జబర్దస్త్ కు దూరం కాబోతున్నాడు అని టాక్ నడుస్తుంది. ఒక్క సినిమా కోసం జబర్దస్త్ కు సుధీర్ దూరం అవ్వడం ఫూలిష్ డెసిషనే అవుతుంది. మరి సుధీర్ అంత తొందర పడతాడా? కనుక ఈ విషయం పై నెటిజనులు పలు కామెంట్లతో తెగ ట్రోల్ చేస్తున్నారు సుధీర్ ని. కొంతమంది అయితే సుధీర్ అన్న నీకు సినిమాలు అవసరం లేదు నీకు జబర్దస్త్, ఢీ షో లు చాలు అవే నిన్ను నిలబెడతాయి. సినిమాలు చేసి అవి ప్లాప్ అయ్యాక పరువు పోగొట్టుకోవడం మేలా? లేకుంటే వున్న పేరు నే కాపాడుకుంటూ పైకి ఎదగడం మేలా? అని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.