“నాకు ఎప్పటినుండో స్పోర్ట్స్ డ్రామా ఒకటి చెయ్యాలని ఆశ. నిజానికి గతంలో ఆర్.బి.చౌదరి గారి బ్యానర్లో ఇలాంటి బ్యాక్ డ్రాప్ తో ‘మెరుపు’ అనే సినిమాని మొదలు పెట్టాం. కానీ, కొన్ని కారణాల వల్ల దానిని మధ్యలోనే ఆపేశాం.దాన్ని కంప్లీట్ చెయ్యలేదని ఇప్పటికీ చాలా ఫీల్ అవుతున్నాను. అయితే అప్పటి నుండీ స్పోర్ట్స్ డ్రామా ఒకటి చెయ్యాలనే కోరిక మాత్రం ఎక్కువయ్యింది.మంచి కథ కోసం చూస్తున్నాను. కానీ నన్ను టెంప్ట్ చేసే స్క్రిప్ట్ మాత్రం ఇంకా దొరకలేదు. ఒకవేళ దొరికితే కచ్చితంగా చేస్తాను'’ అంటూ చెప్పుకొచ్చాడు రామ్ చరణ్.