ఇప్పుడు అనుష్క కూడా చేసేది లేక సుధీర్ బాబు ని ఫాలో అవుతుందట. తన క్రేజీ మూవీ 'నిశ్శబ్దం'ను కూడా ఓటిటిలో విడుదల చేస్తే డిజిటల్ మీడియా సంస్థలకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉందని.. కొందరు భావిస్తున్నారు. అయితే ‘నిశ్శబ్దం’ దర్శకనిర్మాతలు మాత్రం ఇంకా తగ్గడం లేదు.దానికి ప్రధానంగా రెండు కారణాలు అని తెలుస్తుంది. నిర్మాతలు సినిమాకు పెట్టిన బడ్జెట్ కు అలాగే ఓటిటి సంస్థలు చెప్పే రేటుకి అస్సలు సంబంధం లేదనేది ఒక కారణమైతే.. 2 ఏళ్ళ తరువాత అనుష్క నుండీ రాబోతున్న చిత్రాన్ని థియేటర్లోనే విడుదల చెయ్యాలనుకోవడం మరో కారణం అని తెలుస్తుంది.ఏదేమైనా దసరా లోపు నిర్మాతలు ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉందనేది కూడా ఇన్సైడ్ టాక్. ఇక థియేటర్ లు అయితే ఇప్పుడల్లా తెరుచుకోవు. ఇక చేసేదిలేక ఓ టీ టీ లో నే విడుదల చెయ్యాలి... చూడాలి మరి ఫైనల్ గా ఏమవుతుందో..!