ఇటీవల రిజర్వేషన్ కు సంబంధించి తన స్టైల్ లో పూరి చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్ని రేపాయనే చెప్పాలి. ఓ వర్గం వారు పూరి కామెంట్స్ పై ఘోరంగా విరుచుకు పడుతున్నారు. వివరాల్లోకి వెళితే రిజర్వేషన్ అనేది కులాన్ని బట్టి ఇవ్వకూడదు. పేదవాడు ఏ కులంలో అయినా ఉండొచ్చు. చెప్పాలంటే అలాంటి వాళ్లకు ఉండాలి. నిజం చెప్పాలి అంటే రిజర్వేషన్ తీసుకోవడం అంటే అడుక్కు తినడమే అంటూ చేసిన కామెంట్ ఓ వర్గం వారికి మండేలా చేసింది.