పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వినబడితే చాలు ఫ్యాన్స్ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత వినబడుతుంది. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకుని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. తనకంటూ సెపరేట్ క్రేజ్ ను ఏర్పరుచుకున్నాడు. చేసిన మొదటి 7 సినిమాల్లో 6 హిట్లందుకుని సరికొత్త రికార్డు క్రియేట్ చేసాడు.