రాష్ట్రంలో 18లక్షలమంది రైతులు ఉచిత వ్యవసాయ విద్యుత్ పొందుతున్నారు. వీరందరికీ కరెంటు బిల్లులకోసం ప్రత్యేక బ్యాంకు ఖాతాలు తెరిచి అందులోకి నగదు బదిలీ చేస్తామంటోంది ప్రభుత్వం. ప్రతిపక్షాలు మాత్రం దీన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. నగదు బదిలీ పేరుతో క్రమంగా పథకాన్ని ఎత్తేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు దుయ్యబడుతున్నాయి. కౌలు రైతులు ఈ విధానంతో తీవ్రంగా నష్టపోతారని అంటున్నారు టీడీపీ, వామపక్షాల నేతలు.