అనూహ్యంగా పవన్ ‘అయ్యప్పన్ కొషియం’ రీమేక్ లో నటించబోతున్నాడు అంటూ ప్రచారం మొదలైంది. ఈ రీమేక్ లో రానా, రవితేజ లు నటించబోతున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. కానీ అధికారిక ప్రకటన రాలేదు. ఈ రీమేక్ కు త్రివిక్రమ్ డైలాగ్స్ రాయబోతున్నట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే 60 రోజుల్లో ప్రాజెక్ట్ ఫినిష్ చేసేట్టు అయితే నేను కాల్ షీట్లు ఇస్తాను అని పవన్ ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ వారితో చెప్పినట్టు భోగట్టా..! దాంతో వారు కూడా రెండో హీరో కోసం వెతుకులాట మొదలుపెట్టారట.