పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు అటు జనసేన పార్టీ కార్యకర్తలు, ఇటు పవన్ కల్యాణ్ సినీ వీరాభిమానులు అందరూ పండగ చేసుకున్నారు. పవన్ కల్యాణ్ సినిమాలనుంచి ఒకదాని వెంట ఒకటిగా వస్తున్న అప్ డేట్స్ తో ఖుషీ అయ్యారు. కానీ పవన్ కల్యాణ్ ని సీఎంగా చూడాలనుకుంటున్న కరడుగట్టిన జనసేన కార్యకర్తలు మాత్రం బాగా డిజప్పాయింట్ అయ్యారు. పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తారనుకున్న టైమ్ లోనే వీరంతా బాధపడ్డారు. పోనీ ఓ సినిమా చేసి ఇలా వచ్చేస్తారు, పార్టీ గురించే ఆలోచిస్తారని అనుకుంటే.. ఒకటి కాదు, రెండు కాదు. ఏకంగా నాలుగు సినిమాలు లైన్లో పెట్టి రాజకీయంగా తనని అభిమానించేవారందర్నీ నైరాశ్యంలోకి నెట్టేశారు జనసేనాని.