ఆది పురుష్ పేరుతో ప్రభాస్ రాముడిగా నటించబోతున్న సినిమాలో సైఫ్ అలీఖాన్ ని రావణుడి పాత్రకు ఖాయం చేసుకున్నారు దర్శక నిర్మతాలు. ఈ మేరకు అధికారికంగా అప్ డేట్ ఇచ్చేశారు. అయితే మరో ఇంట్రస్టింగ్ న్యూస్ కూడా దీనితోపాటు చక్కర్లు కొడుతోంది. సైఫ్ రావణుడిగా నటిస్తే.. ఆయన భార్య మండోదరి పాత్రలో కరీనా కపూర్ నటిస్తుందని అంటున్నారు. భర్త సైఫ్ తో కలసి తాను కూడా ఈ భారీ సినిమాలో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తోందట కరీనా. ఈమేరకు కరీనా కపూర్ నిజ జీవిత పాత్రలోలాగే సినిమాలో రావణుడి భార్యగా నటించబోతున్నట్టు తెలుస్తోంది.