పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ వేసిన ట్వీట్ వారిమధ్య విభేదాలను బైటపెట్టిందని నిన్నంతా చర్చ జరిగింది. కనీసం పవన్ కల్యాణ్ ట్విట్టర్ హ్యాండిల్ కూడా మెన్షన్ చేయకుండా ఏదో మొహమాటానికి అల్లు అర్జున్ ట్వీట్ వేశారని పవన్ ఫ్యాన్స్ ట్రోలింగ్ మొదలు పెట్టారు. అయితే ఆ తర్వాత అల్లు అర్జున్ మరో ట్వీట్ వేసి వారిని కూల్ చేశారు. పవన్ కల్యాణ్ అభిమానులు ఫ్లెక్సీ కడుతూ కరెంట్ షాక్ కి గురై మరణించిన సంఘటన తననెంతో బాధకు గురిచేసిందని చెప్పిన పవన్, వారి కుటుంబాలకు తలా 2లక్షల రూపాయలు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. దీంతో పవన్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై పొగడ్తల వర్షం కురిపించారు.