అయితే ఇదే అంశంపై ఆయా దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు తీవ్రంగా పరిశోధనలు సాగిస్తున్నారు. వైరస్ మ్యూటేషన్ అనే అంశంపై అమెరికాలోని వాల్టర్ రీడ్ ఆర్మీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ సైంటిస్టులు 84 దేశాలకు చెందిన 27 వేల మందిపై అధ్యయనం చేశారు. 18,514 వైరస్ జీనోమ్లను సీక్వెన్స్ చేసి చూశారు. అయితే ఈ అధ్యయనంలో పెద్దగా మ్యుటేషన్లు లేవని తేలినట్లుగా ప్రకటించారు. అంతేకాకుండా వుహాన్లో మహమ్మారి ప్రబలినప్పటి నుంచి ఇప్పటిదాకా వైరస్ జీన్స్లలో మార్పులు జరిగింది చాలా తక్కువగా ఉందని కూడా గుర్తించారు.