వకీల్ సాబ్’ తరువాత పవన్… క్రిష్ డైరెక్షన్లో సినిమాని కంప్లీట్ చేస్తాడా లేక హరీష్ శంకర్ డైరెక్షన్లో సినిమాని కంప్లీట్ చేస్తాడా అనే కొత్త డిస్కషన్ మొదలైంది. చెప్పాలంటే .. క్రిష్ చిత్రం ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఒక షెడ్యూల్ కూడా ఫినిష్ అయ్యింది అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే క్రిష్ తో పవన్ చేసే సినిమా చారిత్రాత్మక చిత్రం కాబట్టి.. అందులోనూ యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి.. కాస్త ఎక్కువ టైం పట్టే అవకాశం ఉందట.