ఓటీటీలో 'వి' సినిమా విడుదల సందర్భంగా నాని వర్సబెట్టి అందరికీ ఇంటర్వ్యూలిస్తున్నారు. ఇలా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాని తన మనసులో మాట బైటపెట్టారు. నిర్మాతలెవరైనా డబ్బులకోసమే సినిమాలు తీస్తారని, అయితే పరిస్థితులు అనుకూలించక నష్టాలు వస్తాయని తెలిసినప్పుడు నటీనటులు కూడా వారికి సహకరించాలని పారితోషికం తగ్గించుకోవాలని సూచించారు. "నిర్మాతలకు నష్టం రాకుండా చూసుకోవడం మన బాధ్యత. అలాగని కథానాయకులందరూ వాళ్ల పారితోషికాన్ని తగ్గించుకోవాలని నేనేం జనరల్ స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. ఒక సినిమాకు నష్టాలొస్తున్నాయని అనుకున్నప్పుడు ఆ మాత్రం తగ్గించుకోవడమో, వెనక్కి ఇవ్వడమో చేయాలి. నిర్మాతకు ఏమీ మిగలదనుకుంటే జీరో పారితోషికానికీ వెనకడుగు వేయకూడదు." అని సెలవిచ్చారు నాని.