క్రాక్ సినిమానుంచి విడుదలైన హీరో రవితేజ స్టిల్ అదిరిపోయిందని అంటున్నారు అభిమానులు. మీసంపై చెయ్యి వేసిన రవితేజ లుక్ వైసీపీ ఎంపీ, మాజీ పోలీస్ ఆఫీసర్ గోరంట్ల మాధవ్ నే గుర్తుకు తెస్తోంది. దీంతో కచ్చితంగా ఇది గోరంట్ల మాధవ్ పై తీస్తున్న సినిమానే అని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్, ఓ పొలిటీషియన్ ని ఎలా ఢీకొన్నారు, తదనంతర పరిణామాలు అనే అంశంపై ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.