ఓటీటీ ప్లాట్ ఫామ్ సేఫ్ జోన్ కాదని మరోసారి రుజువైంది. నాని సినిమా ఇలా స్ట్రీమింగ్ అయిందో లేదో అలా పైరసీ సైట్లలో ప్రత్యక్షమైంది. రామ్ గోపాల్ వర్మ సినిమాలతో సహా.. ఇటీవల ఓటీటీల్లో వచ్చిన పలు తెలుగు చిత్రాలు కూడా ఇలాగే పైరసీ బారిన పడ్డాయి. తాజాగా ఇప్పుడు నానికి కూడా ఆ తిప్పలు తప్పలేదు.