ట్విట్టర్లో మెసేజ్ లు పెట్టేటప్పుడు సెలబ్రిటీలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. కానీ నిర్మాత బండ్ల గణేష్ తొందరపాటులో ఓ మెసేజ్ పెట్టి నవ్వులపాలయ్యాడు. పవన్ కల్యాణ్ తో సినిమా చేయడం పక్కా అని చెప్పబోయి.. పొరపాటున బూతు మెసేజ్ పెట్టేశాడు బండ్ల గణేష్. తీరిగ్గా తప్పు తెలుసుకుని ట్వీట్ డిలీడ్ చేశాడు.