రెండు నెలల క్రితం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకొని మరణించగా కుటుంబ సభ్యులు ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. సుశాంత్ మృతికి హీరోయిన్ రియా చక్రవర్తి కారణం అని వారు కేసు నమోదు చేశారు. ఈ కేసు ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు సీబీఐకి అప్పగించడం జరిగింది. అనేక కోణాలలో ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న సీబీఐ సుశాంత్ డ్రగ్స్ వాడుతారని తెలుసుకున్నారు.