వి సినిమాని ఓటీటీకి ఇవ్వడం వల్ల నిర్మాత దిల్ రాజు, ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్ సేఫ్ అయిపోయారు. మూడు కోట్లకు కాస్త అటు ఇటుగా ఓవర్ సీస్ బయ్యర్ గతంలో వి సినిమాను తీసుకున్నారు. సినిమాని ఓటీటీకి ఇచ్చేయడంతో ఆ మూడు కోట్లు ఇప్పుడు రిటర్న్ చేశారు నిర్మాత దిల్ రాజు. ఇలా జరక్కపోతే వి సినిమా ఫలితానికి ఓవర్ సీస్ బయ్యర్ పై గట్టి దెబ్బ పడేదని చెబుతున్నారు.