నాని 'వి' సినిమా ఓటీటీలో రిలీజైంది. ఇంటిల్లిపాదితో కలిసి సినిమా చూశాడు రాజమౌళి. అందరూ కలిసి సినిమా చూసిన ఫొటోను కార్తికేయ పోస్ట్ చేశాడు కూడా. సరిగ్గా ఇక్కడే వ్యవహారం అడ్డం తిరిగింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా రంగంలోకి దిగిపోయారు. నాని 'వి' సినిమా గురించి మాకెందుకు.. ఆర్ఆర్ఆర్ నుంచి కొమరం భీమ్ టీజర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పమంటూ తెగ కామెంట్స్ పెట్టారు. హీరోలంతా సెట్స్ పైకి వస్తున్నారు, మీరెప్పుడు సెట్స్ పైకి వస్తున్నారో చెప్పండంటూ రాజమౌళిని టాగ్ చేసి కామెంట్స్ పెట్టారు. వి సినిమా చూస్తున్న ఫొటోని పొరపాటున అప్ లోడ్ చేసి, ఆర్ఆర్ఆర్ విషయంలో బుక్కైపోయారు రాజమౌళి.