లాక్ డౌన్ కాలంలో హీరో ప్రభాస్ వరసబెట్టి సినిమాలు సెట్ చేస్తున్నారు. చేతిలో రాధేశ్యామ్ ఉంది. నాగ్ అశ్విన్ తో ఓ కమిట్ మెంట్ ఉంది, ఈలోగా ఆది పురుష్ అనౌన్స్ అయింది. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్ తో డిస్కషన్ చేశారని టాక్. ఈ నేపథ్యంలో అసలు ప్రభాస్ ఏ సినిమా ముందు చేస్తాడు, ఏది తర్వాత చేస్తాడు. ఏది ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు రిలీజవుతుంది అనే విషయంపై అభిమానులు సందిగ్ధంలో ఉన్నారు. సినిమాల ఆర్డర్ పై ప్రభాస్ కి మాత్రం క్లారిటీ ఉందని తెలుస్తోంది.