నెంబర్ రేస్ పై తనకు నమ్మకం లేదని, అసలు టాప్ హీరోయిన్ అనే ప్లేస్ కోసం తానెప్పుడూ ఆశపడలేదని, ఆశ పడనని చెప్పేసింది శృతి హాసన్. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శృతి.. అభిమానులతో తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటుంది. తాజాగా ఆమె అనేక విషయాలపై నిర్మొహమాటం లేకుండా మాట్లాడింది. హీరోయిన్గా ఎలాంటి లక్ష్యాల్ని పెట్టుకోలేదని, జీవితాన్ని యథాతథంగా తీసుకోవాలని తాను నమ్ముతానంటోంది శృతి.