బిగ్ బాస్ 4 కి చాలామంది ప్రమోటర్స్ ఉన్నారు. వీరంతా ప్రోగ్రామ్ మొదలైన రోజు తమ యాడ్స్ టీవీల్లో చూసుకోవాలనుకున్నారు. కానీ స్టార్ మా ఛానెల్ మాత్రం వారికి చిన్న కండిషన్ పెట్టింది. తొలిరోజు యాడ్స్ వేయబోమని, పూర్తి స్థాయిలో ప్రోగ్రామ్ మొదలయ్యాకే యాడ్స్ వేస్తామని చెప్పేశారు నిర్వాహకులు. దీంతో పార్టనర్స్ కాస్త నిరాశచెందారని సమాచారం. దీనికి తగ్గట్టుగానే బిగ్ బాస్ మొదలైన ఆదివారం ప్రమోటర్స్ యాడ్స్ చాలా తక్కువగా కనిపించాయి.