సరిలేరు నీకెవ్వరు సినిమాలో జయప్రకాష్ రెడ్డికి రెండే డైలాగులు ఉంటాయి. ఫస్టాఫ్ అంతా పండబెట్టి-పీక కోసి అనే డైలాగ్ చెబుతూ కనిపిస్తారు. ఇక సెకెండాఫ్ అంతా కూజాలు చెంబులౌతాయి అనే డైలాగ్ మాత్రమే ఉంటుంది. ప్రకాష్ రాజ్ తండ్రిగా ఈ సినిమాలో నటించారు జయప్రకాష్ రెడ్డి. ఆ రెండు డైలాగ్స్, ఆ సీన్స్ సినిమాలో పేలినా.. జయప్రకాష్ రెడ్డికి తగిన పాత్ర అది కాదు అని అంటుంటారు ఆయన అభిమానులు.