అఖిల్ నుంచి ఫోన్ అందుకున్న నోయల్ ‘ఏంది ప్రాబ్లం’ అనగానే ఆరియానా మైండ్ బ్లాక్ అయిపోయింది. ‘మీరు మర్యాదగా అడిగితే.. మేం మర్యాదగా పంపిస్తాం’ అంటూ నోయల్ కంటిన్యూ చేశాడు. దానికి ఆరియానా ‘ఆ ష్యూర్ అండి.. మీ పేరు’ అంటూ సాగదీసింది. ఆ మాటకు నోయల్ భలే ఝలక్ ఇచ్చాడు. ‘నా పేరు గూగుల్ చేసుకో.. అర్థమైందా బాయ్’ అంటూ ఫోన్ పెట్టేశాడు. అక్కడ బిగ్బాస్ హౌస్లో నవ్వులు పూయగా, ఇక్కడ నైబర్ హౌస్లో ఫేస్లు బ్లాంక్ అయిపోయాయి. ‘అదేందే అట్లా కట్ చేసిర్రు’ అంటూ సోహైల్ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టాడు.