బాలు ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు ఎంజీఎం వైద్యులు. బాలు చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు. వెంటిలేటర్, ఎక్మో సాయంతో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే ఆయనకు వెంటిలేటర్ తీసేయాలని వైద్యులు భావిస్తున్నట్లు ఎస్పీ చరణ్ తెలిపారు. గత వారాంతంలో ఎస్పీ బాలు దంపతులు పెళ్లి రోజును కూడా ఆస్పత్రిలోనే జరుపుకున్నారట. ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ పూర్తిగా తొలగిపోతే బాలుని డిశ్చార్జి చేసే అవకాశాలున్నాయి.