ఇటీవల కాలంలో తెలంగాణలో టీఆర్ఎస్ నేతలతో కాస్త కలివిడిగా ఉంటున్నారు ప్రభాస్. టీఆర్ఎస్ ఎంపీ గ్రీన్ ఛాలెంజ్ కి స్పందించి, అడవిని దత్తత తీసుకోవడంతోపాటు పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే ఈ కార్యక్రమాలన్నిటితో టీఆర్ఎస్ నేతలకు ఎక్కువగా మైలేజీ వస్తోంది, తద్వారా తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తోంది. దీనిపై బీజేపీకి కంటగింపుగా ఉంది.