డ్రగ్స్ కేసులో హీరోయిన్ సంజన అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆమెను సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ మొదలు పెట్టారు. అయితే ఆమె అరెస్ట్ వెనక ఇద్దరు వ్యక్తులు కీలకంగా ఉన్నారని తెలుస్తోంది. మత్తు పదార్థాల విక్రయదారుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజన స్నేహితుడు రాహుల్, ఈవెంట్ మేనేజర్ పృథ్వీశెట్టి చెప్పిన అంశాలే ఆమెకు ముప్పు తెచ్చిపెట్టాయట.