ఆర్ఆర్ఆర్ విషయంలో చరణ్, ఎన్టీఆర్ కు మాటలు కలవట్లేదని తెలుస్తోంది. ఇప్పటికే టైమ్ బాగా వేస్ట్ అయిందని, తనని ముందుగా వదిలిపెడితే త్రివిక్రమ్ తో సినిమాకు రెడీ అవుతానని చెప్పారట ఎన్టీఆర్. అటు చరణ్ కూడా పట్టుదలకు పోతున్నారట. తన పోర్షన్ పూర్తయితే చిరంజీవి సినిమాపై దృష్టిపెట్టాలని, ఆచార్య షూటింగ్, రిలీజ్ వ్యవహారాలతో తనకు బోల్డంత పని ఉందని అంటున్నారట. దీంతో రాజమౌళి డైలమాలో పడ్డారని తెలుస్తోంది.