కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు చిరు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తయింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. 'ఆచార్య'లో క్యూట్ గర్ల్ రష్మిక మందన నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే రష్మిక పాత్ర కేవలం పది నిమిషాల నిడివి మాత్రమే ఉండనున్నట్లు సమాచారం.