పెళ్లి చేసుకోవడం బుద్ధి తక్కువ పని అంటూ పూరీ మ్యూజింగ్స్ లో ఆడియో విడుదల చేసిన దర్శకుడు పూరీ జగన్నాథ్ పై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. వివాహ వ్యవస్థను కించపరిచేలా మాట్లాడటం సరికాదని పూరీకి హితవు పలికాయి. వివాహం వద్దంటున్నారంటే.. పరోక్షంగా పూరీ లివ్ ఇన్ రిలేషన్ ని సమర్థిస్తున్నట్టేనని, భారతీయ సమాజంలో ఇలాంటి పిచ్చి వ్యవహారాలు సరికాదని, వెంటనే పూరీ తన మాటల్ని వెనక్కి తీసుకోకపోతే కేసు పెడతామని డిమాండ్ చేసారు హిందూ సంఘాల నేతలు.