మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న వేదాళం తెలుగు రీమేక్ లో సాయిపల్లవి, చిరంజీవి సోదరిగా కనిపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ మేరకు చిత్ర దర్శకుడు మెహెర్ రమేష్ సాయి పల్లవి ని సంప్రదించారని టాక్. ఇప్పటికే స్క్రిప్టు పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆచార్య షూటింగ్ ముగిసిన అనంతరం పట్టాలెక్కనుంది.