హీరో ప్రభాస్ కి కొన్నిరోజులుగా ఓ తలనొప్పి ఎదురైంది. యూట్యూచ్ ఛానెళ్ల వార్తలతో ప్రభాస్ ఇమేజ్ డ్యామేజీ అవుతోంది. ప్రభాస్ కి డ్రగ్స్ వార్తలతో లింక్ పెడుతూ వార్తలు రాయడమే దీనికి కారణంగా తెలుస్తోంది. పాన్ ఇండియా హీరో కావడంతో అందరూ ప్రభాస్ పైనే పడ్డారు. దీంతో ప్రభాస్ తీవ్రంగా అప్సెట్ అయ్యారని తెలుస్తోంది. ఇలాంటి వార్తలిచ్చేవారితో వెంటనే మాట్లాడాలని, తన ఫొటోలు వేయొద్దని చెప్పాలని, అవసరమైతే లీగల్ యాక్షన్ తీసుకోవాలని పీఆర్ టీమ్ ని ఆదేశించారట ప్రభాస్.