ఓ వైపు కేన్సర్ తో పోరాడుతూనే సంజయ్ దత్ ఇలా షూటింగ్ చేస్తుండటం అభిమానులను కలవరపెడుతున్న విషయం. కానీ తన వలన నిర్మాతలు నష్టపోకూడదని. మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే అన్యాయమని భావించిన సంజయ్ దత్ ఒప్పుకున్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిసైడ్ అయ్యాడట. అందులో ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల సినిమా కూడా ఒకటి. ఇక తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్ తో మాట్లాడిన సంజయ్ ఎట్టి పరిస్థితుల్లోనూ మీ సినిమా షూటింగ్ లో పాల్గొంటానని చెప్పినట్లుగా తెలుస్తోంది.