మహేష్ బాబు కొత్త సినిమా సర్కారువారి పాటలో బాలీవుడ్ ఒకప్పటి ప్రముఖ హీరో అనిల్ కపూర్ విలన్ గా చేస్తున్నారనే వార్తలొస్తున్నాయి. పరశురామ్ దర్శకత్వంలో సర్కారువారి పాట తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ నవంబర్ లో ప్రారంభమవుతుందని అనుకుంటున్నారు. అమెరికాలో లొకేషన్లు చూడటం కోసం దర్శకుడు పరశురామ్ వెళ్తున్నారని కూడా వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ విలన్ ప్రస్తావన కూడా వచ్చింది.