హీరో బాలయ్య ఎస్పీ బాలు ఆరోగ్యం గురించి ప్రతిరోజు ఫోన్ చేసి వాకబు చేస్తారట. బాలుగారికి ఎలా ఉందని అడిగి తెలుసుకుంటారట. అలాగే మీరు దిగులు పడకండి ఆయన ఖచ్చితంగా కోలుకుంటారని ధైర్యం చెవుతారట. దైవభక్తి మెండుగా ఉన్న బాలయ్య ప్రతి రోజు రెండు మూడు గంటలు పూజ చేస్తారట. ఆ పూజలో బాలు త్వరగా కోలుకోవాలని కోరుకున్నట్లు తనకు చెప్పినట్లు శుభలేఖ సుధాకర్ తెలియజేశారు.