సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారంలో కంగనా రనౌత్ ని సమర్థించేవారికంటే, విమర్శించేవారే ఇప్పుడు ఎక్కువవుతున్నారు. ముంబై విషయంలో ఆమె చేసిన కామెంట్ ని చాలామంది తప్పుపట్టారు. ఆ తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగనా చేసిన విమర్శలు, తదనంతర పరిణామాలపై కూడా సినిమా ఇండస్ట్రీవాళ్లు విరుచుకుపడుతున్నారు. తాజాగా ప్రకాష్ రాజ్ కూడా కంగనా రనౌత్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.