రెడ్ సినిమా నిర్మాతల ఆఫర్ కి జెమిని సన్ నెక్ట్స్ టీమ్ నో చెప్పినట్లు తెలుస్తోంది. ఓటీటీ కి డైరక్ట్ గా ఇచ్చే ఆలోచన చేస్తే, శాటిలైట్ అమౌంట్ తగ్గించాలని కండిషన్ పెట్టిందట. దీంతో రెడ్ నిర్మాతలు ఓటీటీ ఆలోచన పక్కనపెట్టారని తెలుస్తోంది. ఓటీటీ బిజినెస్ తో లాభం వస్తుందనుకుంటే, శాటిలైట్ రైట్స్ లో కోతపడే ప్రమాదం ఉండటంతో ఆ ఆలోచన వదిలేసుకున్నారట నిర్మాతలు. దసరా లేదా దీపావళి టైమ్ కి థియేటర్లు తెరుచుకుంటే రెడ్ సినిమాను నేరుగా థియేటర్లలోనే విడుదల చేయాలని ఆలోచిస్తున్నారట.