ఇటీవలే శ్రీయ స్వయంగా తాను ఆర్.ఆర్.ఆర్ లో దేవగణ్ సరసన కనిపిస్తానని ప్రకటించడంతో ఆ విషయంలో కూడా క్లారిటీ వచ్చేసింది. అదంతా సరే కానీ.. శ్రీయ మరో మాట కూడా చెప్పింది. ఈ సినిమాలో దేవగణ్ సరసన నటించే ఆఫర్ వచ్చినా చరణ్- తారక్ ఉన్న సీన్లలో కనిపించే భాగ్యం దక్కకపోవడంపై అసంతృప్తిగా ఉందని తెలిపింది. ఇక ఛత్రపతి లాంటి మాస్ సినిమాలో తనకు అవకాశం ఇచ్చిన రాజమౌళి మరోసారి అవకాశం ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేసింది. అజయ్ దేవగన్ జెంటిల్మన్.. మంచి మనిషి. ఆయన సరసన నటించడం సంతోషమేనని అంది.